హైదరాబాద్: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ బ్యాంకింగ్ రంగంలోనూ వినూత్న మార్పులు వస్తున్నాయి. తాజాగా క్రెడిట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ ‘CheQ’, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి LED క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఈ కార్డు కేవలం స్టైల్ కోసమే కాకుండా, పేమెంట్ సెక్యూరిటీని సూచించే ఒక వినూత్న టెక్నాలజీతో రూపొందించబడింది.LED కార్డు ఎలా పనిచేస్తుంది?సాధారణంగా మనం దుకాణాల్లో వైర్లెస్ పేమెంట్స్ చేసినప్పుడు (Tap to Pay), పేమెంట్ సక్సెస్ అయిందో లేదో పీఓఎస్ (POS) మెషీన్ వైపు చూడాల్సి ఉంటుంది. కానీ ఈ కార్డుతో ఆ అవసరం లేదు. మీరు మెషీన్ దగ్గర కార్డును ట్యాప్ చేయగానే, కార్డులోని LED లైట్ మెరుస్తుంది. ఇది పేమెంట్ ప్రక్రియ జరుగుతోందని యూజర్లకు విజువల్ సిగ్నల్‌ను ఇస్తుంది.బ్యాటరీ అవసరం లేదు..ఈ కార్డులో లైట్ వెలగడానికి విడిగా ఎలాంటి బ్యాటరీ ఉండదు. కార్డ్ రీడర్ లేదా POS మెషీన్ నుంచి వచ్చే NFC (Near Field Communication) సిగ్నల్స్ ద్వారానే ఇది శక్తిని గ్రహించి వెలుగుతుంది. దీనివల్ల కార్డు మందం పెరగదు, సాధారణ కార్డులాగే స్లిమ్‌గా ఉంటుంది.కీలక విశేషాలు:UPI సదుపాయం: ఇది RuPay వేరియంట్లో లభిస్తుంది కాబట్టి, నేరుగా మీ మొబైల్ ద్వారా UPI పేమెంట్లకు లింక్ చేసుకోవచ్చు.ప్రీమియం మెటల్ లుక్: కార్డు ఎంతో విలాసవంతంగా, మెటాలిక్ ఫినిషింగ్‌తో ఉంటుంది.ధర: దీని వార్షిక రుసుము ₹499. అయితే ఏడాదిలో ₹3 లక్షలు ఖర్చు చేస్తే ఈ రుసుమును మాఫీ చేస్తారు. LED ఎడిషన్ కావాలనుకునే వారు వన్-టైమ్ ఫీజుగా ₹999 చెల్లించాల్సి ఉంటుంది.ఎప్పుడు లభిస్తుంది: ఏప్రిల్ 28, 2026 నుండి CheQ యాప్ ద్వారా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడంతో పాటు, యూజర్లకు ఒక కొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
